కామారెడ్డి జిల్లాలో మానవత్వం మంటగలిసే ఘటన చోటుచేసుకుంది. దొమకొండ దొమకొండ మండల గ్రామ శివారులో, అప్పుడే పుట్టిన పసికందును చెట్ల పొదల్లో వదిలేసి వెళ్లిపోయిన అమానవీయ ఘటన కలకలం రేపింది. గొర్రెల కాపర్ల అప్రమత్తతతో శిశువుకు ప్రాణాపాయం తప్పింది.
మండల గ్రామ శివారులోని చెట్ల పొదల మధ్య నుంచి పసికందు ఏడుపు వినిపించడంతో, అటుగా గొర్రెలు కాస్తున్న కాపర్లు గమనించారు. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా, అప్పుడే పుట్టిన శిశువు కనిపించింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, శిశువును రక్షించారు. తొలుత దోమకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.












