కామారెడ్డి జిల్లాలో పేకాట, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా కేంద్రంలో పేకాట స్థావరంపై దాడులు నిర్వహించి 65 మందిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి భారీగా నగదు, సెల్ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
జిల్లాలో జూదం, పేకాట నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో పేకాట స్థావరాలపై నిర్వహించిన తనిఖీలు, ఆకస్మిక దాడుల్లో 65 మంది జూదరులను పట్టుకుని 15 కేసులు నమోదు జిల్లా ఎస్పీ శ్రీ రాజేష్ చంద్ర, ఐపీఎస్ తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పోలీసుల తనిఖీల్లో నిందితుల వద్ద నుంచి రూ.2.68 లక్షల నగదు, 57 సెల్ఫోన్లు, 23 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో ఎక్కడైనా పేకాట, జూదం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.












