జనావాసాల మధ్య టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించవద్దని భిక్కనూర్ ఎస్సై అనిల్ కుమార్ వ్యాపారులను హెచ్చరించారు. టపాకాయల విక్రయాలు చేపట్టే వారు సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతులు పొందడంతో పాటు తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు.

తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
టపాకాయలు పేలుడు స్వభావం కలిగిన వస్తువులు కావడంతో వాటి విక్రయాల విషయంలో వ్యాపారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్సై అన్నారు. నివాస ప్రాంతాలు, జనసంచారం అధికంగా ఉండే ప్రదేశాల్లో దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, ప్రజల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.