టాలీవుడ్లో కల్ట్ కామెడీ చిత్రంగా గుర్తింపు పొందిన ఈ నగరానికి ఏమైంది సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ట్రైలర్ విడుదలైంది. దర్శకుడు తరుణ్ భాస్కర్ రూపొందిస్తున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి మరోసారి తమ పాత స్నేహితుల పాత్రల్లో ప్రేక్షకులను అలరించనున్నారు.
ట్రైలర్లో నలుగురు స్నేహితులు కలిసి ఓ సినిమా తీయాలని నిర్ణయించుకోవడం, ఆ ప్రయత్నంలో ఎదురయ్యే విచిత్రమైన సంఘటనలు, గందరగోళం, హాస్యభరిత సన్నివేశాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. మొదటి సినిమాలోని స్నేహం, కామెడీ వాతావరణాన్ని కొనసాగిస్తూ కొత్త కథను దర్శకుడు సిద్ధం చేసినట్లు ట్రైలర్ సూచిస్తోంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించడంతో పాటు కథను కూడా అందించారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. అనీషా అంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్ తదితరులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.












