కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ సదాశివ నగర్ మండలం భూంపల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ప్రత్యేక దాడి నిర్వహించారు. ఈ దాడిలో 8 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదు, సెల్ఫోన్లు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ జూదం, పేకాట నిర్వహించే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలోనే భూంపల్లి గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు ప్రత్యేకంగా దాడి నిర్వహించారు. దాడిలో అక్రమంగా పేకాట ఆడుతున్న 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.13,390 నగదు, 8 సెల్ఫోన్లు, 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టినట్లు సమాచారం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా ఎస్సై పుష్పరాజ్ మాట్లాడుతూ, అక్రమ జూదం, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. జూదానికి బానిసై తమ జీవితాలను, కుటుంబాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. జూదం అనేది వ్యక్తిగత జీవితాన్నే కాకుండా కుటుంబాలను కూడా ఆర్థికంగా, సామాజికంగా చిన్నాభిన్నం చేసే దుర్వ్యసనమని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత ఇలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండి తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని ఎస్సై పుష్పరాజ్ హితవు పలికారు.












