ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన పాఠశాల ఘటనలో నిందితుడు హేమంత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అతడికి అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బుల్లెట్లు తగలడంతో అతడి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో అతడి కాళ్లను తొలగించాల్సిన పరిస్థితి రావచ్చని వైద్యులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే, అనంతపురం జిల్లా మండలంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని గోపికపై న హేమంత్ ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేశాడు. తరగతి గదిలోకి చొరబడి బాలిక ముఖం, తల, వీపు భాగాల్లో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. స్నేహితురాలిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని లక్ష్మిపైనా దాడి చేయడంతో ఆమె రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పోలీసులపై కత్తితో దాడి యత్నం
నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఆదివారం ఆత్మకూరు అటవీ ప్రాంతంలో హేమంత్ ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో అతడు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించడమే కాకుండా సీఐ వెంకటేశ్వర్లుపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో సీఐ చేతికి గాయాలయ్యాయి.












