విశాఖపట్నం నగరంలో మూడేళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. తినుబండారాలు కొనిపెడతానని చెప్పి బాలికను తీసుకెళ్లి ఎరిపిల్లి యోగి అనే వ్యక్తి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, విచారణ ప్రక్రియను ప్రారంభించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరిస్తున్న పోలీసులు, బాలికకు అవసరమైన వైద్య సహాయాన్ని అందిస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుల కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు.












