తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద ఆదివారం సాయంత్రం ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఆలయానికి చెందిన ఏనుగు ఒక్కసారిగా రెచ్చిపోవడంతో మావటి చంద్రశేఖర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనతో ఆలయ ప్రాంగణంలో భక్తులు భయాందోళనలకు గురయ్యారు.
ప్రతిరోజూ సాయంత్రం అమ్మవారి వాహన మండపంలో నిర్వహించే ఊంజల్ సేవ కోసం ఆలయ ఏనుగులను తీసుకువస్తారు. ఆదివారం సేవ ముగిసిన అనంతరం ఏనుగులను తిరిగి ఉద్యానవనానికి తరలిస్తుండగా, ఒక ఏనుగు అకస్మాత్తుగా ప్రవర్తన మార్చుకుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మావటి చంద్రశేఖర్ ను కింద పడేసి తొక్కివేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఏనుగు దాడితో భక్తులు భయాందోళనతో పరుగులు తీయడంతో ఆలయ ప్రాంగణంలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.












