చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సౌందర్ రాజన్ మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. సౌందర్ రాజన్ ఆధ్యాత్మిక సేవలను ఆయన స్మరించుకున్నారు.
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు సౌందర్ రాజన్ అకస్మాత్తుగా మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సౌందర్ రాజన్ తన జీవితాన్ని చిలుకూరు బాలాజీ ఆలయ సేవకే అంకితం చేశారని, భక్తుల విశ్వాసాలను నిలబెట్టడంలో ఆయన పాత్ర కీలకమైనదని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆలయ సంప్రదాయాలను కాపాడుతూ, పరిపాలనలోనూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం చేయడంలోనూ సౌందర్ రాజన్ విశేష కృషి చేశారని జగన్ గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు.












