కామారెడ్డి, 12 September
కామారెడ్డి జిల్లా దేవునిపల్లి గ్రామంలో వినాయక చవితి వేడుకలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని స్థానిక ఎస్సై రంజిత్ సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సోదరభావంతో పండుగను జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు గ్రామంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
శాంతియుతంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించాలి కామారెడ్డి : దేవునిపల్లి గ్రామంలో వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని దేవునిపల్లి ఎస్సై రంజిత్ సూచించారు. వినాయక నవరాత్రుల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సోదరభావంతో పండుగను జరుపుకోవాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. గణేష్ మండపాల నిర్వాహకులు, గ్రామ ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్సై కోరారు. పండుగ సమయంలో ఎలాంటి గొడవలు, వివాదాలకు తావివ్వకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని తెలిపారు. మండపాల వద్ద భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలం కొనసాగుతున్నందున గణేష్ మండపాల వద్ద ప్రత్యేక అప్రమత్తత అవసరమన్నారు. విద్యుత్ వైర్లు, స్తంభాలు, తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుని ప్రమాదాలు జరగకుండా చూడాలని సూచించారు. చిన్నపిల్లలు మండపాల వద్దకు వచ్చినప్పుడు నిర్వాహకులు, తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. గణేష్ ఉత్సవాల్లో డీజేలు ఏర్పాటు చేయవద్దని ఎస్సై రంజిత్ స్పష్టం చేశారు. శబ్ద కాలుష్యానికి తావులేకుండా పోలీసుల సూచనలు, నిబంధనలు పాటిస్తూ వేడుకలను నిర్వహించాలని తెలిపారు. ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని మండపాల నిర్వాహకులకు సూచించారు. గ్రామ ప్రజలంతా ఐక్యంగా ఉండి వినాయక చవితి వేడుకలను ఆనందోత్సాహాలతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని ఎస్సై పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఎస్ఐ రామకృష్ణ, కానిస్టేబుల్ ఓం ప్రకాష్, గ్రామ ప్రజలు, వివిధ గణపతి మండపాల అధ్యక్షులు, నిర్వాహకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.











