వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రసిద్ధ గండి శ్రీ వీరాంజనేయ దేవస్థానంలో ప్రధాన అర్చకుల తీరుపై భక్తులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. హారతి పళ్లెంలో భక్తులు సమర్పించే కానుకల విషయంలో తలెత్తుతున్న వివాదాలు, అదనపు డబ్బుల డిమాండ్ వంటి ఆరోపణలపై దేవదాయ శాఖ అధికారులు స్పందించారు.
రాయలసీమలో ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న గండి శ్రీ వీరాంజనేయ దేవస్థానం, ఇటీవల కాలంలో ఆలయ ప్రధాన అర్చకుల ప్రవర్తన తీరుపై వస్తున్న ఫిర్యాదులతో వార్తల్లో నిలుస్తోంది. భక్తులు హారతి పళ్లెంలో ఇచ్చే డబ్బుల విషయంలో అర్చకుల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయని, దీనిపై పలువురు భక్తులు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ ఆరోపణల నేపథ్యంలో, నెల రోజుల క్రితం దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ పట్టెం గురు ప్రసాద్, భక్తులు సమర్పించే కానుకలను నేరుగా హుండీలో వేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే, ప్రధాన అర్చకుడు కేసరి స్వామి ఈ ఆదేశాలను పాటించడం లేదని, కానుకలను వ్యక్తిగతంగా తీసుకుంటున్నారని ఆరోపణలున్నాయి.












