ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా, 30వ తేదీ సోమవారం హనుమంత్ సేవ సందర్భంగా శ్రీ కోదండరామునికి క్షత్రముల సమర్పణ కార్యక్రమాన్ని 24 నక్షత్రముల యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
ఈ ప్రత్యేక కార్యక్రమం ఉదయం 5 గంటలకు భువనగిరిపల్లిలోని భువనగిరిగుట్టపై ఉన్న లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో పూజతో మొదలవుతుంది. అనంతరం లక్ష్మినరసింహ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అల్పాహారం అందిస్తారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఉదయం 7 గంటలకు భువనగిరి గుట్ట నుంచి యల్లమ్మ ఆలయం వరకు గ్రామోత్సవం జరుగుతుంది. యల్లమ్మ ఆలయం వద్ద భోజన ఏర్పాట్లు కూడా ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు.
సాయంత్రం 3 గంటలకు ఒంటిమిట్ట చేరుకున్నాక, 4 గంటలకు శ్రీ కోదండరామ స్వామికి క్షత్రములు సమర్పించబడతాయి. ఈ కార్యక్రమానికి హిందూ బంధు మిత్రులందరూ హాజరు కావాలని 24 నక్షత్రముల యువజన సంఘం పిలుపునిచ్చింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీరాముల ఆశీర్వాదాలు పొందాలని నిర్వాహకులు కోరారు.









