తిరుమల కొండపై భక్తుల రద్దీ అపూర్వంగా కొనసాగుతోంది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు. సర్వదర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతుండగా, నిన్న ఒక్కరోజులో రూ. 4.31 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. గదులు సరిపోకపోవడంతో మిగిలిన భక్తులు బయట క్యూలైన్లలో ఓపికగా వేచి ఉంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు తాగునీరు, పాలు, అన్నప్రసాదాలను నిరంతరాయంగా అందిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నిన్న ఒక్కరోజే 83,812 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 38,345 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తుల రద్దీ ఇలాగే కొనసాగే అవకాశం ఉందని, కాబట్టి భక్తులు తగిన జాగ్రత్తలతో రావాలని అధికారులు సూచిస్తున్నారు.












