మండల పరిధిలోని ఎడిఫై స్కూల్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందని, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్బీ రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి షంషుద్దీన్‌కు ఏఐఎస్బీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
అనంతరం రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పాఠశాల నిర్వహణ సమయంలోనే భవనం పై ఫ్లోర్లో నిర్మాణ పనులు చేపడుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
విద్యార్థులు తరగతుల్లో ఉన్న సమయంలోనే నిర్మాణ పనులు చేయడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.












