యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించేందుకు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి పి.తేజస్విని దరఖాస్తులను ఆహ్వానించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులకు ఈ శిక్షణతో పాటు భోజన, వసతి సౌకర్యాలు కూడా కల్పించబడతాయి.
అన్నమయ్య జిల్లాలోని అర్హులైన అభ్యర్థులు ఈ నెల 20.10.2026 లోగా జిల్లా బీసీ సంక్షేమ అధికారి కార్యాలయం, బి.టి. పీజీ కాంపౌండ్, రూమ్ నం.143, మదనపల్లెలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 27.10.2026న రాష్ట్రవ్యాప్తంగా నిర్ణయించిన కేంద్రాల్లో సివిల్ సర్వీసెస్ సిలబస్ ఆధారంగా స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన 100 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు.












