భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, కొత్తగూడెం, అక్టోబర్ 21: హైదరాబాద్‌లోని బేగంపేట, రామంతాపూర్ పబ్లిక్ స్కూల్స్‌లో చదువుతున్న నిరుపేద గిరిజన విద్యార్థులకు పూర్తిస్థాయి వసతి సదుపాయాలు కల్పించాలని, పాఠశాలల ప్రాంగణాల్లోనే శాశ్వత హాస్టల్ భవనాలు నిర్మించాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జాతీయ కోశాధికారి, సామాజిక కార్యకర్త డా. భట్టు వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరవాలని ఆయన అన్నారు. 2016 నుంచి గిరిజన విద్యార్థుల హాస్టళ్ల సమస్యలపై పోరాడుతున్నా ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారం చూపకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ అనేక విజ్ఞప్తులు చేసినా ఆశించిన ఫలితం లేదని విమర్శించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, కొత్తగూడెం, అక్టోబర్ 21: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, కొత్తగూడెం, అక్టోబర్ 21: హైదరాబాద్‌లోని బేగంపేట, రామంతాపూర్ పబ్లిక్ స్కూల్స్‌లో చదువుతున్న నిరుపేద గిరిజన విద్యార్థులకు పూర్తిస్థాయి వసతి సదుపాయాలు కల్పించాలని, పాఠశాలల ప్రాంగణాల్లోనే శాశ్వత హాస్టల్ భవనాలు నిర్మించాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జాతీయ కోశాధికారి, సామాజిక కార్యకర్త డా. భట్టు వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరవాలని ఆయన అన్నారు. 2016 నుంచి గిరిజన విద్యార్థుల హాస్టళ్ల సమస్యలపై పోరాడుతున్నా ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారం చూపకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ అనేక విజ్ఞప్తులు చేసినా ఆశించిన ఫలితం లేదని విమర్శించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు డా. భట్టు వెంకన్న సమాధానాలు ఆయన మాటల్లోనే.. ప్రశ్న: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్స్‌లో గిరిజన విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమిటి భట్టు వెంకన్న: బేగంపేట, రామంతాపూర్ పబ్లిక్ స్కూల్స్‌లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు సురక్షితమైన వసతి కల్పించాలి. కానీ హాస్టళ్ల నిర్వహణ, భోజనం, సిబ్బంది, రవాణా, విద్యా దుస్తులు, బ్యాగ్స్, దోబి, ట్యూషన్ టీచర్స్, వాచ్మెన్, కేర్టెకర్స్ లేరని ప్రైవేట్ ఏజెన్సీల నిర్లక్ష్యం వంటి అంశాలపై పిల్లల తల్లిదండ్రులు అనేక ఫిర్యాదులు చేసినా ఫలితం లేదన్నారు. అద్దె భవనాలు, ప్రైవేట్ ఏజెన్సీల నిర్వహణపై ఆధారపడే విధానానికి బదులుగా, శాశ్వత హాస్టళ్లను నిర్మించి ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలి.












