కామారెడ్డి పట్టణంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో దసరా పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. రావణాసురుడి దహనంతో దసరా ఉత్సవాలు ముగిశాయి. ఈ వేడుకలను తిలకించేందుకు ప్రజలు భారీ సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు.
దసరా సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక లేజర్ షో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రంగురంగుల కాంతులు, లేజర్ ప్రదర్శనలతో స్టేడియం సందడిగా మారింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రావణాసురుడి దహనాన్ని వీక్షించేందుకు చిన్నారులు, యువత, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పండుగ వాతావరణంలో ప్రజలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.












