సింగపూర్‌లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను కామారెడ్డి మిత్రులు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను సింగపూర్‌లోని కామారెడ్డి మిత్రులు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ ఫ్లోరల్ ఫెస్టివల్ 2017న సింగపూర్‌లోని అవర్ టాంపిన్స్ హబ్ టౌన్ స్క్వేర్‌లో వైభవంగా జరిగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ వేడుకల్లో కామారెడ్డి మిత్రులు తమ సహకారాన్ని అందించి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో భాగస్వాములయ్యారు. వారి విలువైన మద్దతును గుర్తిస్తూ తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) కమిటీ వారిని సత్కరించింది. ఈ సత్కార కార్యక్రమం సాయంత్రం 7:30 గంటలకు ప్రధాన వేదికపై నిర్వహించారు.












