మండలం ఇస్రోజీవాడి గ్రామంలో చైతన్య యువజన సంఘం 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం అన్నప్రసాద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ యువత సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. గ్రామాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని తెలిపారు.
మండలం ఇస్రోజీవాడి గ్రామంలో చైతన్య యువజన సంఘం 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం అన్నప్రసాద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత గణేశుడి విగ్రహానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాదాన్ని ప్రారంభించి, సంఘ సభ్యులతో కలిసి ప్రజలకు భోజనాలు వడ్డించారు. ప్రజలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా సీఐ శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ యువత ఉత్సవాల నిర్వహణకే పరిమితం కాకుండా సమాజ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. గ్రామాభివృద్ధిలో యువత పాత్ర కీలకమన్నారు. ఆరోగ్య శిబిరాలు, విద్యార్థులకు సహకారం, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.












