సింగరేణి లాభాలకు కారకులైన కాంట్రాక్టు కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 13వ తేదీన ప్రకటించిన బోనస్ నేటి వరకు అందలేదని ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్, టియుసిఐ ఆధ్వర్యంలో కార్మికులు ఇల్లందు జిఎం కార్యాలయాన్ని ముట్టడించారు. బోనస్ చెల్లింపులో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వారు ఆందోళన వ్యక్తం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, ఇల్లందు, అక్టోబర్ 19: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, ఇల్లందు, అక్టోబర్ 19: సింగరేణి లాభాలకు కారకులైన కాంట్రాక్టు కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 13వ తేదీన ప్రకటించిన బోనస్ నేటి వరకు కూడా అందలేదని ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (పిఎస్సిడబ్ల్యూయు), టియుసిఐ అనుబంధం ఆధ్వర్యంలో కార్మికులు ఇల్లందు జిఎం కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం, ముట్టడి గేటు వద్దకు వచ్చిన జిఎం కృష్ణయ్య, యూనియన్ ప్రతినిధులైన షేక్ యాకుబ్ షావలి, బి. రామ్ సింగ్, పాయం వెంకన్నలతో చర్చించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ నెల 13న లాభాల వాటా ప్రకటన చేశారని వారు గుర్తు చేయగా, బోనస్ కాంట్రాక్టు కార్మికులకు వేయడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, కాంట్రాక్టు కార్మికులను సింగరేణి అధికారులు అసలు లెక్కచేయడం లేదని షేక్ యాకుబ్ షావలి జిఎం దృష్టికి తీసుకువెళ్లారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సింగరేణిలో ఒకే కుటుంబం, ఒకే గమ్యం, ఒకే లక్ష్యం వంటి పెద్ద నినాదాలు చేస్తారు కానీ, కాంట్రాక్టు కార్మికుల పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకని వారు ప్రశ్నించారు. అనంతరం జిఎం స్పందిస్తూ, ఈరోజు రాత్రి 8 గంటల లోపు మెజారిటీ కాంట్రాక్టర్లకు ఆన్లైన్లో రూ. 5,500 బోనస్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కార్మికుల ఖాతాల్లో జమ అయ్యేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. అయితే, రేపు పండగ ఎలా చేసుకోవాలి సార్ అని కార్మికులు అడగగా, జిఎం మాట దాటవేశారు.












