కామారెడ్డి జిల్లా మండలంలోని హెల్ప్ గొండ గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలను మహిళలు ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో మహిళలు గ్రామంలో పండుగ సందడిని నింపారు. అనంతరం మహిళలు బతుకమ్మలకు పూజలు నిర్వహించి, సంప్రదాయబద్ధంగా వేడుకలను జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను గ్రామీణ మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలు మహిళల్లో ఐక్యతను, సంతోషాన్ని పెంపొందించడంతో పాటు తెలంగాణ సంస్కృతీ వైభవాన్ని చాటిచెప్పాయి. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి











