తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళా సిబ్బంది బతుకమ్మలను అలంకరించి, పాటలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా సిబ్బంది సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను అలంకరించి, బతుకమ్మ పాటలతో వేడుకలను ఉత్సాహభరితంగా జరుపుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్, పోలీస్ అధికారులు, మహిళా పోలీస్ సిబ్బంది, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.












