జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో బుధవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్, ఇతర అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి వీరుల త్యాగాలను స్మరించుకున్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటామని కలెక్టర్, ఎస్పీ హామీ ఇచ్చారు.
జిల్లా నుంచి ఇప్పటివరకు ఏడుగురు పోలీసులు విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేశారని, వారి కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, 1951లో లడఖ్‌లోని అక్సాయ్ చిన్ ప్రాంతంలో చైనా దళాల దాడిలో పది మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది అమరులైన ఘటనకు గుర్తుగా ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 154 మంది పోలీసులు వీరమరణం పొందగా, తెలంగాణ నుంచి నలుగురు అమరులయ్యారని ఆయన పేర్కొన్నారు.












