కామారెడ్డి, 2026-06-05
కామారెడ్డి జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. జిల్లా నోడల్ ఆఫీసర్ షేక్ సలాం తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంవత్సరం ఇప్పటివరకు మొత్తం 3746 మంది విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు పొందారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా నోడల్ ఆఫీసర్ కార్యాలయంలో నోడల్ ఆఫీసర్ షేక్ సలాం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నోడల్ ఆఫీసర్ షేక్ సలాం మాట్లాడుతూ, ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు 3746 రావడం జరిగిందని తెలిపారు.












