నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి తన కుటుంబానికి, తారకరత్న కుటుంబానికి మధ్య ఉన్న సంబంధాలపై తాజాగా స్పందించారు. తన వివాహానికి ఇంట్లో అంగీకారం లేదనే వార్తలను ఆమె ఖండించారు.
నందమూరి తారకరత్న జీవిత భాగస్వామి అలేఖ్య రెడ్డి, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, కుటుంబ సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన వివాహానికి ఇంట్లో అంగీకారం లేదనే ప్రచారాన్ని ఆమె తోసిపుచ్చారు. తన ఇంట్లో తమ వివాహానికి పూర్తి మద్దతు లభించిందని, అయితే తారకరత్న కుటుంబం నుంచి అంగీకారం లభించలేదని ఆమె తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆ సమయంలో కుటుంబానికి దూరంగా ఉండాలనే ఆలోచన ఎవరికీ ఉండదని, ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని ఎవరూ ఊహించలేదని అలేఖ్య రెడ్డి పేర్కొన్నారు. పెద్దవాళ్లలో కోపాలు సహజమని, ఏరోజుకైనా వారు తమను అంగీకరిస్తారనే నమ్మకంతోనే ఉన్నామని ఆమె వెల్లడించారు.











