కన్నడ
దసరా పండుగ సందర్భంగా కర్ణాటకలోని తీర ప్రాంతాల్లో పులి వేషాల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. తుళు భాషలో పిలి అంటే పులి, వేష అంటే వేషధారణ. ఈ పిలి వేషం దసరా ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. శరీరంపై పులి చారలను పోలిన రంగులు వేసుకుని, డప్పుల లయకు అనుగుణంగా కళాకారులు చేసే విన్యాసాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దసరా వచ్చిందంటే అమ్మవారి ఆలయాలు, శోభాయాత్రలు, డప్పుల మోతతో పండుగ వాతావరణం నెలకొంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది పులి వేషం. ఒంటినిండా పసుపు, నలుపు రంగులతో పులిలా అలంకరించుకుని, డప్పుల శబ్దానికి అనుగుణంగా నృత్యాలు చేస్తూ కళాకారులు ప్రేక్షకులను అలరిస్తారు. ముఖ్యంగా కర్ణాటక తీర ప్రాంతమైన మంగళూరు, ఉడుపి ప్రాంతాల్లో పిలి వేషగా ప్రసిద్ధి చెందిన ఈ జానపద కళకు దసరా ఉత్సవాల్లో ప్రత్యేక స్థానం ఉంది.












