ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ సైన్స్ ఫిక్షన్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ నుంచి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ రాబోతోంది. నెట్‌ఫ్లిక్స్ తాజాగా అదర్ వరల్డ్స్: ఎ స్ట్రేంజర్ థింగ్స్ అడ్వెంచర్ పేరుతో కొత్త ప్రీక్వెల్ సిరీస్‌ను ప్రకటించింది. ఈ సిరీస్ 2028లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
కొత్త సిరీస్ కథ 1955లో అమెరికాలోని నెవాడా రాష్ట్రం, మారియన్ ప్రాంతంలో సాగనుంది. హెన్రీ క్రీల్ మరో ప్రపంచానికి సంబంధించిన శక్తులతో పరిచయం ఏర్పడకముందు జరిగిన సంఘటనలపై కథ నడవనుంది. అసలు హెన్రీ క్రీల్ ఎలా మారాడు అతడి జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలేంటి అనే అంశాలను ఈ ప్రీక్వెల్‌లో చూపించనున్నారు. స్ట్రేంజర్ థింగ్స్ సృష్టికర్తలు మాట్ డఫర్, రాస్ డఫర్ ఈ ప్రాజెక్టును సహ-సృష్టిస్తున్నారు. కేట్ ట్రెఫ్రీ షోరన్నర్‌గా వ్యవహరించనున్నారు. ప్రముఖ దర్శకుడు జో రైట్ తొలి మూడు ఎపిసోడ్లకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సిరీస్ చిత్రీకరణ న్యూ మెక్సికోలో జరగనుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఇప్పటికే వచ్చిన స్ట్రేంజర్ థింగ్స్ కథకు భిన్నంగా కొత్త ప్రదేశం, కొత్త పాత్రలు, కొత్త నేపథ్యంతో ఈ సిరీస్‌ను రూపొందించనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. అయితే నటీనటుల వివరాలను ఇంకా ప్రకటించలేదు. ఈ ప్రాజెక్టు ద్వారా స్ట్రేంజర్ థింగ్స్ కథా ప్రపంచాన్ని మరింత విస్తరించేందుకు నెట్‌ఫ్లిక్స్ సిద్ధమైంది. 2028లో విడుదల కానున్న ఈ ప్రీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.











