టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. 13 ఏళ్ల పాటు భారత టెస్ట్ జట్టుకు సేవలందించిన ఈ సీనియర్ బౌలర్.. ఇకపై సంప్రదాయ ఫార్మాట్లో ఆడబోనని వెల్లడించారు. న తన టెస్ట్ అరంగేట్రం చేసిన రోజే ఈ నిర్ణయాన్ని ప్రకటించడం విశేషం.
షమీ తన సోషల్ మీడియా ఖాతాలో భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. భారత టెస్ట్ జెర్సీని తొలిసారి ధరించిన రోజు నుంచి ప్రతి వికెట్, ప్రతి గాయం, ప్రతి పునరాగమనం తనకు ఎన్నో పాఠాలు నేర్పాయని పేర్కొన్నారు. తన ప్రయాణంలో తోడుగా నిలిచిన సహచరులు, కోచ్‌లు, కుటుంబ సభ్యులు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
64 టెస్టులు.. 229 వికెట్లు
2013లో వెస్టిండీస్‌తో కోల్‌కతాలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో షమీ అంతర్జాతీయ టెస్ట్ ప్రస్థానం ప్రారంభమైంది. తన కెరీర్లో మొత్తం 64 టెస్టులు ఆడి 229 వికెట్లు పడగొట్టారు. ఇందులో ఆరు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించారు. 27.71 బౌలింగ్ సగటుతో భారత పేస్ దళంలో కీలక పాత్ర పోషించారు.











