తమిళ యువ దర్శకుడు, నటుడు అభిషన్ జీవింత్ ఇంట్లో సంతోషం నెలకొంది. ఆయన భార్య అఖిల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను అభిషన్ న సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అభిషన్ తన చేతుల్లో అప్పుడే పుట్టిన చిన్నారిని పట్టుకున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అధికారికంగా ఆడబిడ్డకు తండ్రినయ్యాను అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఇటీవలే తొలి పెళ్లిరోజు
అభిషన్ జీవింత్, అఖిల గత ఏడాది అక్టోబర్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరూ చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. చెన్నైలోని హను రెడ్డి పోయెస్ గార్డెన్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుక జరిగింది. అనంతరం గ్రీన్ పార్క్ హోటల్లో జరిగిన రిసెప్షన్‌కు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇటీవలే ఈ జంట తమ మొదటి పెళ్లిరోజును జరుపుకుంది. పెళ్లిరోజు వేడుకకు సంబంధించిన ఫోటోలను కూడా అభిషన్ పంచుకున్నారు. ఆ వేడుక జరిగిన కొద్ది రోజులకే తమకు పాప పుట్టిన విషయాన్ని వెల్లడించారు.












