జమ్మలమడుగులోని ఎస్పి డిగ్రీ కళాశాలలో యువతకు భరోసా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చదిపిరాళ్ళ భూపేష్ సుబ్బరామిరెడ్డి, శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. యువత దేశానికి భవిష్యత్తు అని, సమర్థవంతమైన నాయకత్వంతోనే ప్రకాశవంతమైన భవిష్యత్తు సాధ్యమని భూపేష్ సుబ్బరామిరెడ్డి అన్నారు.
జమ్మలమడుగు పట్టణంలోని ప్రతిష్టాత్మక ఎస్పి డిగ్రీ కళాశాలలో శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తో ఏర్పాటు చేసిన యువతకు భరోసా - సమర్థత, నాయకత్వం, ప్రకాశవంతమైన భవిష్యత్తు కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చదిపిరాళ్ళ భూపేష్ సుబ్బరామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థినీ విద్యార్థులతో నేరుగా ముచ్చటిస్తూ వారికి భరోసా కల్పించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
యువత చైతన్యంపై భూపేష్ రెడ్డి పిలుపు











