స్వచ్ఛత, పారిశుద్ధ్య కార్యక్రమాల అమలులో విశిష్ట కృషి చేసినందుకు గాను జమ్మలమడుగు మున్సిపాలిటీకి స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్2026లో భాగంగా జిల్లా స్థాయి స్వచ్ఛ మున్సిపాలిటీస్ పురస్కారం లభించింది. ఈ పురస్కారం లభించడంతో మున్సిపల్ అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి జమ్మలమడుగు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డిని శాలువా కప్పి సన్మానించారు. అనంతరం మున్సిపల్ సిబ్బందిని అభినందించి, స్వీట్లు పంపిణీ చేశారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంలో మున్సిపల్ సిబ్బంది కృషి అభినందనీయం అని నారాయణ రెడ్డి పేర్కొన్నారు. పురస్కారం రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జమ్మలమడుగు మున్సిపాలిటీకి లభించిన ఈ పురస్కారం అధికారులు, పారిశుద్ధ్య సిబ్బందికి మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని పలువురు నాయకులు పేర్కొన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు కూడా మున్సిపాలిటీకి సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, జంబాపురం రమణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.












