పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అన్నారు. స్వచ్ఛ భారత్ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని జెపిఎన్ చౌక్ వద్ద నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛ భారత్ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని జెపిఎన్ చౌక్ వద్ద ఏక్ దిన్ ఏక్ ఘంటా ఏక్ సాత్ పేరుతో పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ, పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని పేర్కొన్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, తమ ఇళ్లతో పాటు చుట్టుపక్కల పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.












