కామారెడ్డి జిల్లా రెడ్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా పలువురు నిస్వార్థ రక్తదాతలను సన్మానించారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తాన్ని అందిస్తూ ప్రాణాలను కాపాడుతున్న వీరి సేవలు ప్రశంసనీయమని పలువురు వక్తలు కొనియాడారు.
జిల్లా రెడ్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, దోమకొండకు చెందిన లక్కబత్తిని రవికుమార్, ఏఆర్ కానిస్టేబుల్ ఎండి వాజిద్, భిక్నూర్ కు చెందిన బద్దం నిశాంత్ రెడ్డి, ఎండి జమీల్ అహ్మద్, పర్ష వెంకటరమణలను కామారెడ్డి డిఎస్పీ మధుసూదన్, ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ జిల్లా సమన్వయ సభ్యులు డాక్టర్ బాలు ఘనంగా సన్మానించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా డిఎస్పీ మధుసూదన్ మాట్లాడుతూ రక్తదాతలు ప్రాణదాతలని, ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. డాక్టర్ బాలు ఆధ్వర్యంలో 20 ఏళ్లుగా కొనసాగుతున్న రక్తదాన సేవలను ఆయన ప్రశంసించారు.












