జాతీయ వాలంటరీ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా, అక్టోబరు 1న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి డిస్ట్రిక్ట్ బ్రాంచ్ ఆధ్వర్యంలో, స్థానిక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ ఎం సంజీవరెడ్డి, స్టేట్ ఎంసీ మెంబర్ డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి లు డాక్టర్ రవీందర్ గౌడ్, డాక్టర్ సంతోష్ అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని అతిథులు సూచించారు. ఈ రక్తదాన కార్యక్రమంలో విద్యార్థులతో పాటు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని, రక్తదానం చేశారు. వారిని డాక్టర్లు అభినందించారు. రక్తదానం చేయడం ద్వారా అమూల్యమైన ప్రాణాలను కాపాడవచ్చని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు నరాల వెంకట రెడ్డి, గోవర్ధన్, కిరణ్, శ్రీకాంత్, దత్తాత్రి, నవీన్, లింగం, నర్సారెడ్డితో పాటు విద్యార్థులు, హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి











