తిరుపతి జిల్లా, మండలం చిట్వేలి సమీపంలోని చియ్యవరం ఎస్టీ కాలనీలో కొండచిలువ సంచారం స్థానికంగా భయాందోళనలకు గురిచేసింది. శనివారం రాత్రి ఇళ్ల సమీపంలో కనిపించిన సుమారు 10 అడుగుల కొండచిలువను ఆత్మరక్షణ కోసం గిరిజనులు కొట్టి చంపారు.
చియ్యవరం ఎస్టీ కాలనీలో నివాస గృహాల సమీపంలో సుమారు 10 అడుగుల పొడవైన కొండచిలువ రోడ్డు దాటుతుండగా స్థానికులు గుర్తించారు. ఇళ్లకు దగ్గరగా రావడంతో పిల్లలు, మహిళలు భయంతో కేకలు వేశారు. ఆత్మరక్షణ కోసం గిరిజనులు దానిని కొట్టి చంపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ ప్రాంతం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండటంతో తరచూ పాములు, కొండచిలువలు గ్రామంలోకి వస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో బయటకు రావడానికి భయపడుతున్నామని, చిన్న పిల్లలున్న కుటుంబాలు మరింత ఆందోళనలో ఉన్నాయని తెలిపారు.












