మండలం చియ్యవరం గ్రామంలో మంగళవారం ఉదయం అడవి నుండి దారి తప్పి వచ్చిన పొడ దుప్పిపై వీధి కుక్కలు దాడి చేశాయి. గ్రామస్తులు వెంటనే స్పందించి, కుక్కలను తరిమి దుప్పిని రక్షించి, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
మండలం చియ్యవరం గ్రామంలో మంగళవారం ఉదయం ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. సమీప అడవి నుండి దారి తప్పి ఒక పొడ దుప్పి గ్రామంలోకి వచ్చింది. గ్రామ శివారులోని పొలాల వైపు నుండి హఠాత్తుగా గ్రామంలోకి ప్రవేశించిన దుప్పిని చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అంతలోనే వీధి కుక్కలు దుప్పిపై దాడి చేశాయి. కుక్కల దాడిలో దుప్పికి స్వల్ప గాయాలయ్యాయి. దీన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే స్పందించి, కుక్కలను తరిమి దుప్పిని రక్షించారు.












