కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో నాన్ వెజ్ వ్యర్థాల సేకరణకు అధికారులు టెండర్లను ఆహ్వానించారు. ఈ ప్రక్రియలో భాగంగా గురువారం 9 సంస్థలు దరఖాస్తు చేసుకోగా, అత్యధికంగా 2.34 లక్షల రూపాయలు కోట్ చేసిన హైదరాబాద్‌కు చెందిన షా ఎంటర్ ప్రైజెస్‌కు కాంట్రాక్ట్ దక్కింది.
మున్సిపాలిటీ పరిధిలో నాన్ వెజ్ వ్యర్థాల సేకరణకు అధికారులు టెండర్లను ఆహ్వానించారు. వివిధ ప్రాంతాల నుంచి 9 సంస్థలు దరఖాస్తు చేయగా, గురువారం మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, టెండర్ నిర్వాహకుల సమక్షంలో టెండర్లను తెరిచారు. 9 సంస్థల్లో ఇద్దరు ప్రతినిధులు గైర్హాజరయ్యారు. కనకదుర్గ ఎంటర్ ప్రైజెస్ డీడీ సమర్పించకపోవడంతో వారి టెండర్‌ను తిరస్కరించారు. మిగిలిన 8 సంస్థల టెండర్లను తెరిచారు. హైదరాబాద్‌కు చెందిన షా ఎంటర్ ప్రైజెస్ అత్యధికంగా 2 లక్షల 34 వేల రూపాయలు కోట్ చేయడంతో వారికి టెండర్ దక్కింది. ఇతర సంస్థలలో మైనే ఫుడ్ అండ్ సీడ్స్ 1.85 లక్షలు, ఆజాల్ ట్రేడర్స్ 1.65 లక్షలు, మహబూబా ఎంటర్ ప్రైజెస్ 1.80 లక్షలు, తాజ్ ఎంటర్ ప్రైజెస్ 1.72 లక్షలు, ఎస్ కేపీ ట్రేడర్స్ 1.55 లక్షలు, మనం ఎంటర్ ప్రైజెస్ 1.80 లక్షలు టెండర్ దాఖలు చేశాయి. ఈ సందర్భంగా కమిషనర్ పర్వతాలు మాట్లాడుతూ టెండర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. మున్సిపల్ నిబంధనలకు అనుగుణంగా చికెన్, మటన్, ఫిష్ వ్యర్థాలను సేకరించాలని కాంట్రాక్ట్ పొందిన సంస్థకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈ హన్మంత్ రావు, టీపీఓ వినీత్ పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి











