కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్న రాజయ్య (45)కు అత్యవసరంగా ఏ పాజిటివ్ తెల్ల రక్త కణాలు అవసరమయ్యాయి. కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు సూచనతో, కు చెందిన లక్కబత్తిని రవికుమార్ స్పందించి 44వసారి తెల్ల రక్త కణాలను అందజేశారు.
ఎల్లంపేట గ్రామానికి చెందిన చిన్న రాజయ్య క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండగా, వైద్యులు అతనికి ఏ పాజిటివ్ తెల్ల రక్త కణాలు అత్యవసరమని తెలిపారు. దీంతో రాజయ్య కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయ సభ్యులు డాక్టర్ బాలును సంప్రదించారు. ఆయన వెంటనే స్పందించి, రక్తదానంతో ఆదర్శంగా నిలుస్తున్న మండల కేంద్రానికి చెందిన లక్కబత్తిని రవికుమార్ కు విషయం తెలియజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రవికుమార్ వెంటనే స్పందించి, క్యాన్సర్ బాధితుడైన చిన్న రాజయ్యకు 44వ సారి తెల్ల రక్త కణాలను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ, దసరా పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ వారి కుటుంబాలతో ఆనందంగా గడుపుతారని, కానీ నిస్వార్థపరులైన రక్తదాతలు ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడటానికి పండుగను సైతం పక్కనపెట్టి తెల్ల రక్త కణాలను అందజేయడం లక్కబత్తిని రవికుమార్ మానవత్వానికి నిదర్శనమని అన్నారు.












