ఇజ్రాయెల్ భద్రత, భవిష్యత్తు కీలక దశలో ఉన్నాయని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. ఎన్నికల్లో తన పార్టీకి మద్దతుగా ఓటర్లు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. వామపక్ష శక్తులు ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
దేశ భద్రతను కాపాడాలంటే లికుడ్ పార్టీకి ఓటు వేయాలని తన మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాఖ్యలు ఇజ్రాయెల్‌లో జరుగుతున్న పార్లమెంటరీ ఎన్నికల నేపథ్యంలో వెలువడ్డాయి. ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలకంగా మారిన ఈ ఎన్నికల్లో నెతన్యాహు తన ప్రభుత్వ భద్రతా విధానాలను ప్రధాన ప్రచార అంశంగా ముందుకు తీసుకొచ్చారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఇరాన్ నుంచి ఎదురవుతున్న ముప్పులు, ప్రాంతీయ ఘర్షణలు, దేశ రక్షణకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ ఓటర్ల మద్దతు కోరుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనకున్న సంబంధాలను కూడా ప్రచారంలో ప్రస్తావించారు. సోమవారం రాత్రి విడుదల చేసిన సందేశంలో, ఇజ్రాయెల్ ప్రత్యర్థులు తమ ఓటమిని కోరుకుంటున్నారని నెతన్యాహు పేర్కొన్నారు.












