పాకిస్థాన్‌లో పత్రికా స్వేచ్ఛకు తీవ్ర ముప్పు వాటిల్లుతోందని, వార్తలపై ఆంక్షలు, జర్నలిస్టులపై చట్టపరమైన వేధింపులు, ఆన్లైన్ బెదిరింపులు, ఆర్థిక ఇబ్బందులు స్వతంత్ర జర్నలిజానికి సవాళ్లుగా మారాయని సీనియర్ పాత్రికేయులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, భావప్రకటనా హక్కును కాపాడేందుకు జర్నలిస్టులు, మీడియా సంఘాలు, రాజకీయ నాయకులు, పౌర సమాజ ప్రతినిధులు ఐక్యంగా పోరాడాలని నిర్ణయించారు.
ఇస్లామాబాద్‌లో జరిగిన ఒక చర్చా సమావేశంలో ఈ అంశంపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. సీనియర్ జర్నలిస్టు మునిజే జహంగీర్ సమన్వయం చేసిన ఈ సమావేశానికి ప్రముఖ పాత్రికేయుడు నాసిర్ జైదీ అధ్యక్షత వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు తమకు ఎదురవుతున్న సమస్యలను వివరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మీడియాపై ఒత్తిళ్లు, వార్తల ప్రచురణలో జోక్యం, చట్టాల దుర్వినియోగం, డిజిటల్ కమ్యూనికేషన్‌పై ఆంక్షలు వంటి అంశాలపై సమన్వయంతో పోరాడాలని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. పత్రికా స్వేచ్ఛ ఉల్లంఘనలను పద్ధతిగా నమోదు చేయడం, వాటికి సంబంధించిన వివరాలతో నివేదిక రూపొందించడం వంటి ప్రతిపాదనలు కూడా ముందుకొచ్చాయి.












