ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యారంగం వేగంగా మారుతున్న నేపథ్యంలో, అంతర్జాతీయ విద్యార్థుల నియామకం, విశ్వవిద్యాలయాల మధ్య భాగస్వామ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఇన్ఫినిట్ గ్రూప్ వెల్లడించింది. సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ గౌరవ్ బాత్రా మాట్లాడుతూ, విద్యార్థుల సంఖ్యను పెంచడమే కాకుండా, వారి విద్యా నాణ్యత, ఉపాధి అవకాశాలు, పెట్టిన ఖర్చుకు తగిన ఫలితాలు వచ్చేలా చూడటం ముఖ్యమని అభిప్రాయపడ్డారు.
ఏఎన్ఐ కథనం ప్రకారం, సాంకేతికతతో పాటు స్థానిక మార్కెట్లపై అవగాహన, దీర్ఘకాలిక భాగస్వామ్యాల ద్వారా అంతర్జాతీయ విద్యావ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చడమే సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు రెండు దశాబ్దాల అనుభవంతో అంతర్జాతీయ విద్యారంగంలో పనిచేస్తున్న ఇన్ఫినిట్ గ్రూప్, విశ్వవిద్యాలయాలు, విద్యార్థుల నియామక సంస్థలు, విద్యా సేవలందించే సంస్థల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేస్తోంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రస్తుతం 13 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, సుమారు 4,000 మంది నియామక ఏజెంట్ల నెట్‌వర్క్‌తో పనిచేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. విశ్వవిద్యాలయాలకు అంతర్జాతీయంగా విస్తరించే అవకాశాలను అందించడంతో పాటు, విద్యార్థుల ఎంపికలో పారదర్శకత, నిబంధనల పాటింపు, నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడం తమ విధానమని సంస్థ పేర్కొంది.












