మహిళల భద్రత, శాంతి స్థాపనలో రాజకీయ నాయకత్వం, నిర్ణయాత్మక పదవుల్లో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం అత్యంత కీలకమని భారత్ ఐక్యరాజ్యసమితిలో పేర్కొంది. మహిళలు నాయకత్వ బాధ్యతలు చేపట్టినప్పుడే వారి సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలు లభిస్తాయని స్పష్టం చేసింది.
ఐక్యరాజ్యసమితి వేదికగా మహిళల భద్రత, శాంతి స్థాపన అంశాలపై భారత్ తన అభిప్రాయాలను వెల్లడించింది. మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా శాంతి, భద్రతకు సంబంధించిన నిర్ణయాల్లో సమగ్రత సాధించవచ్చని తెలిపింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మహిళా రిజర్వేషన్లతో నాయకత్వంలో మార్పు
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మహిళలు, శాంతి, భద్రత అంశంపై జరిగిన బహిరంగ చర్చలో ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం వల్ల నిర్ణయాత్మక పదవుల్లో వారి ప్రాతినిధ్యం పెరుగుతుందని ఆయన వివరించారు.
భారత్‌లో స్థానిక సంస్థల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పిస్తూ 1993లో తీసుకున్న నిర్ణయం ద్వారా లక్షలాది మంది మహిళలు నాయకత్వ స్థానాలకు చేరుకున్నారని హరీశ్ గుర్తుచేశారు. మహిళా రిజర్వేషన్ చట్టం2023 ద్వారా పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లోనూ మహిళలకు మూడో వంతు ప్రాతినిధ్యం కల్పించే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి





