ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సాయంత్రం న్యూఢిల్లీలో భారతదేశపు ప్రతిష్టాత్మక భౌగోళిక రాజకీయాలు మరియు భౌగోళిక ఆర్థిక సదస్సు అయిన 11వ రైసినా డైలాగ్ ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి ఫిన్లాండ్ అధ్యక్షుడు డాక్టర్ అలెగ్జాండర్ స్టబ్ ముఖ్య అతిథిగా హాజరై కీలక ప్రసంగం చేస్తారు.
ఈ సదస్సు అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న అత్యంత సవాలుతో కూడిన సమస్యలను పరిష్కరించడానికి అంకితం చేయబడింది. ఈ సంవత్సరం “సంస్కార – ఆసెర్షన్, అకామడేషన్, అడ్వాన్స్మెంట్” అనే థీమ్‌తో జరుగుతుంది.
రైసినా డైలాగ్ లో 110 దేశాల నుండి మంత్రులు, మాజీ దేశాధినేతలు, ప్రభుత్వాల అధిపతులు, పార్లమెంట్ సభ్యులు, సైనిక కమాండర్లు, పరిశ్రమల అధిపతులతో సహా పలువురు ప్రతినిధులు పాల్గొంటారు. సుమారు 2700 మంది ప్రతినిధులు ప్రత్యక్షంగా హాజరు కానున్నారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో, ప్రపంచ నిర్ణయాధికారులు మరియు ఆలోచనాపరులు ఆరు కీలక అంశాలపై వివిధ రూపాల్లో జరిగే చర్చలలో పాల్గొంటారు. ఇందులో కాంటెస్టెడ్ ఫ్రాంటియర్స్, రిపేరింగ్ ది కామన్స్, మరియు ట్రేడ్ ఇన్ ది టైమ్ ఆఫ్ టారిఫ్స్ వంటి అంశాలు ఉన్నాయి.

