గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అంబానీ కుటుంబం నిర్వహిస్తున్న నవరాత్రి వేడుకల్లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన సరదా స్పందనతో అందరినీ నవ్వించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధోనీ తన భార్య సాక్షి ధోనీతో కలిసి ఈ వేడుకలకు హాజరయ్యారు.
జామ్‌నగర్‌లో జరుగుతున్న నవరాత్రి వేడుకల్లో అనంత్ అంబానీ, ఆయన భార్య రాధికా మర్చంట్ కూడా పాల్గొన్నారు. అనంత్ అంబానీ కార్నివాల్‌లోని వినోద రైడ్లను ఎంజాయ్ చేస్తూ, తిరిగే క్యాబిన్ రైడ్లోకి రావాలని ధోనీని ఆహ్వానించినట్లు వీడియోలో కనిపిస్తోంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అయితే, ధోనీ మాత్రం ఆ రైడ్ ఎక్కితే తనకు తల తిరగవచ్చన్నట్లుగా చేతి సైగలతో సరదాగా నిరాకరించారు. ధోనీ ఇచ్చిన ఈ సహజమైన, సరదా స్పందన నెటిజన్లను ఆకట్టుకుంటోంది.











