దేశంలో పెరుగుతున్న చక్కెర ధరలు, తగ్గుతున్న చెరకు దిగుబడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 సరఫరా సంవత్సరానికి గాను, చెరకు రసం, చక్కెర సిరప్, బీ-హెవీ మొలాసిస్ నుంచి ఇథనాల్ తయారీని సున్నాకు తగ్గించింది. ఈ మేరకు కొత్త టెండర్లో చక్కెర ఆధారిత ఇథనాల్‌ను చేర్చలేదు.
భారత్‌లో చక్కెర ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో, చెరకు దిగుబడి తగ్గుతుందన్న అంచనాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 202627 ఇథనాల్ సరఫరా సంవత్సరంలో చక్కెర ఉత్పత్తిని ఇథనాల్ తయారీకి మళ్లించడాన్ని సున్నాకు తగ్గించింది. అంటే చెరకు రసం, చక్కెర సిరప్, బీ-హెవీ మొలాసిస్ నుంచి తయారయ్యే ఇథనాల్‌ను కొత్త కొనుగోలు టెండర్లో చేర్చలేదు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏమిటి
చక్కెర ఆధారిత ఇథనాల్‌పై ఆంక్షలు విధిస్తూ, చెరకు రసం, చక్కెర సిరప్, బీ-హెవీ మొలాసిస్ నుంచి తయారయ్యే ఇథనాల్‌కు కొత్త టెండర్లో కొనుగోలు అవకాశం కల్పించలేదు. అయితే, మొక్కజొన్న, విరిగిన బియ్యం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వద్ద ఉన్న మిగులు బియ్యం వంటి ఇతర ముడి పదార్థాల నుంచి ఇథనాల్ తయారు చేయడానికి ప్రాధాన్యం ఇవ్వనుంది. 2026-27 సరఫరా సంవత్సరానికి ప్రభుత్వ చమురు సంస్థలు సుమారు 1,100 కోట్ల లీటర్ల ఇథనాల్ కోసం టెండర్ పిలిచాయి.











