సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఓబీసీ రిజర్వేషన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే పూర్తయిన నియామకాలు, ఉద్యోగ కేటాయింపులు, సీనియారిటీ నిర్ణయాలను తిరిగి తెరవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన తీర్పును పునర్విచారణ చేయడానికి మధ్యంతర దరఖాస్తులను ఉపయోగించుకోలేరని పేర్కొంది.
సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఓబీసీ రిజర్వేషన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే పూర్తయిన నియామకాలు, ఉద్యోగ కేటాయింపులు, సీనియారిటీ నిర్ణయాలను తిరిగి తెరవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన తీర్పును పునర్విచారణ చేయడానికి మధ్యంతర దరఖాస్తులను ఉపయోగించుకోలేరని పేర్కొంది. అయితే, 2025 సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఎంపికైన ఓబీసీ అభ్యర్థులకు ఇంకా ఉద్యోగ కేటాయింపులు పూర్తికాకపోవడంతో, వారి విషయంలో తల్లిదండ్రుల సామాజిక హోదా, ఉద్యోగ స్థాయిని పరిగణనలోకి తీసుకునే క్రీమీ లేయర్ నిబంధనలను అమలు చేయాలని ఆదేశించింది. గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం సంబంధిత అభ్యర్థులకు నాన్-క్రీమీ లేయర్ ప్రయోజనాలు కల్పించాలని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ పామిడిఘంటం శ్రీ నరసింహ, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పుతో ఇప్పటికే పూర్తయిన నియామకాలపై ఎలాంటి ప్రభావం ఉండదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి








