గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులతో పాటు అసంఘటిత రంగంలోని కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ సామాజిక భద్రతా బోర్డు ఏర్పాటును అధికారికంగా నోటిఫై చేసింది. సామాజిక భద్రతా కోడ్2020 కింద ఈ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ బోర్డు గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలను రూపొందించడానికి, వాటి అమలును పర్యవేక్షించడానికి, కేంద్ర ప్రభుత్వానికి తగిన సిఫార్సులు చేయడానికి పనిచేస్తుంది.
కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి ఈ బోర్డుకు అధ్యక్షత వహిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో పాటు అగ్రిగేటర్ సంస్థలు, యజమానులు, పౌర సమాజ సంస్థలు, కార్మిక సంఘాలు, గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల సంఘాల ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉంటారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రత్యేక సభ్యత్వం
గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులకు సంబంధించిన ప్రత్యేక సభ్యత్వంలో ఈ సంస్థల ప్రతినిధులకు చోటు కల్పించారు. వీరిలో ఎటర్నల్ గ్రూప్, స్విగ్గీ, జెప్టో, అర్బన్ కంపెనీ, రాపిడో సంస్థల ప్రతినిధులతో పాటు కార్మిక సంఘాల ప్రతినిధులకు కూడా ప్రాతినిధ్యం కల్పించారు.











