ఉత్తర కర్ణాటకలో చెరకు ధరలపై రైతుల ఆందోళన కారణంగా చక్కెర కర్మాగారాల్లో చెరకు క్రషింగ్ సీజన్ ప్రారంభంపై అనిశ్చితి నెలకొంది. ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై కూడా ప్రధానితో చర్చించేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు ఆయన తెలిపారు.
ఉత్తర కర్ణాటకలోని చెరకు రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర పెంచాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపడుతున్నారు. రైతులు టన్ను చెరకుకు రూ.5,500 చెల్లించాలని, చక్కెర కనీస విక్రయ ధరను కిలోకు రూ.60కు పెంచాలని, చెరకు ఆధారిత ఇథనాల్ ధరలు, కొనుగోళ్ల విధానంలో మార్పులు చేయాలని కోరుతున్నారు. ఈ డిమాండ్లపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రైతులు ఆందోళనను కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గత నిరసనలు, పాదయాత్ర
గతంలో బెలగావి సమీపంలో పుణెబెంగళూరు జాతీయ రహదారిపై రైతులు నిరసనలు నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లపై ఒత్తిడి పెంచేందుకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసం వైపు పాదయాత్ర చేపట్టారు. చెరకు కోత, రవాణా ఖర్చులు, పంటకు లభిస్తున్న ధరపై రైతుల్లో అసంతృప్తి కొనసాగుతోంది.












