తల్లి స్వయంగా సంపాదించుకున్న ఆస్తిపై వివాహిత కుమారుడికి, కోడలికి చట్టబద్ధమైన హక్కు లేదని, వారి నివాసం తల్లి ఇష్టానికి లోబడి ఉంటుందని ఒరిస్సా హైకోర్టు స్పష్టం చేసింది. హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం, ఒక మహిళ పేరు మీద ఉన్న ఆస్తిపై ఆమెకు పూర్తి మరియు తిరుగులేని అధికారం ఉంటుందని న్యాయస్థానం పునరుద్ఘాటించింది.
ఒక తల్లి తన కుమారుడు, కోడలు తన ఇంట్లో ఉంటూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ 2019లో కేసు దాఖలు చేశారు. రిజిస్టర్డ్ సేల్ డీడ్ తల్లి పేరు మీద ఉన్నందున, ఆ ఆస్తిపై ఆమెకే సర్వహక్కులు ఉంటాయని విచారణలో తేలింది. తల్లిదండ్రులు వేధింపులకు గురవుతున్నప్పుడు, వారి రక్షణకే ప్రాధాన్యత ఇవ్వాలని కోర్టు పేర్కొంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
హిందూ వారసత్వ చట్టం, సెక్షన్ 14 ప్రకారం, మహిళల యాజమాన్యంలోని ఆస్తులు వారి సొంత ఆస్తిగా పరిగణించబడతాయి. కుమారుడు తన వాదనలో భాగంగా ఆస్తి ఉమ్మడి కుటుంబ ఆస్తి అని పేర్కొన్నప్పటికీ, కోర్టు దానిని తోసిపుచ్చింది. "షేర్డ్ హౌస్‌హోల్డ్" (ఉమ్మడి నివాసం) పేరిట కుమారుడు లేదా కోడలు ఆ ఇంట్లో ఉండే హక్కును క్లెయిమ్ చేయలేరని న్యాయస్థానం స్పష్టం చేసింది.











