23వ
ప్రభుత్వ శాఖ టెండర్ ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరించినంత మాత్రాన, మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ప్రజా విధానానికి విరుద్ధమని చెప్పలేమని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. నిర్మాణ పనుల కోసం టెండర్ పిలిచే ముందే భూమి న్యాయపరమైన స్థితిని పరిశీలించకపోవడం, ఆ భూమిపై హైకోర్టు యథాతథ స్థితిని కొనసాగించాలని ఇచ్చిన ఆదేశాలను కాంట్రాక్టర్‌కు తెలియజేయకపోవడం ప్రభుత్వ అధికారుల వైఫల్యమని పేర్కొంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జస్టిస్ వివేక్ అగర్వాల్ ఈ మేరకు తీర్పు వెలువరించారు. లక్మణ్ శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో, జబల్పూర్లోని జిల్లా న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు పక్కన పెట్టింది. మధ్యవర్తిత్వ తీర్పు భారత ప్రజా విధానానికి విరుద్ధంగా ఉందన్న కారణంతో దానిని రద్దు చేయడం సరైన నిర్ణయం కాదని పేర్కొంది.












